*_🏵️మన CPS (PRAN )అకౌంట్ నుండి PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు_*
*Q1: బ్యాంక్ డీటైల్స్ ను ఆన్ లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చునా?*
_ప్రాన్ లో సీపీఎస్ ఉద్యోగుల బ్యాంక్ డీటైల్స్ ఆన్ లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం ఉంది.ఒకవేళ online అవకాశం భవిష్యత్తులో తొలగించినా (లేక) ఆన్ లైన్ ద్వారా update చేసుకోవడం రాకపోయినా... S2 form నింపి DDO చే సంతకం చేయించి, దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జీరాక్స్ జతచేసి STO ఆఫీస్ నందు ఇవ్వాలి._
*Q2) CPS ఉద్యోగులు Self declaration ద్వారా 25% Partial withdraw చేసుకొనవచ్చునా?*
_ది.01.01.2023 నుండి CPS ఉద్యోగి ఆన్ లైన్ ద్వారా Self declaration Option ఇచ్చి 25% withdraw చేసుకొనే అవకాశం లేదు.
*Q3) ప్రస్తుతం 25% withdraw ఏ సందర్భంలో చేయగలరు?*
_ప్రస్తుతం CPS 25% withdraw చేయాలంటే supported document అనగా_
1) Marriage purpose లేదా
2) Home loan purpose లేదా
3) Higher education purpose of child or employee లేదా
4) Medical purpose కి సంబందించిన ఏదో ఒక supported document ఉంటేనే 25% పాక్షిక ఉపసంహరణ అవకాశం ఉంది._
*Q4) 25% withdraw time లో మన Pran account లోని మొత్తం సొమ్ములో 25% ని చెల్లిస్తారా?*
_25% పాక్షిక ఉపసంహరణకు కేవలం employee contribution మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా: ఒక cps ఉద్యోగి pran account లో contribution amount 7 లక్షలు & gained interest on cps amount 3 లక్షలు ,మొత్తం 10 లక్షలు ఉంటే దానిలో contribution amount 7 లక్షలలో state matching grant 3.5 lakhs మినహాయించగా మిగిలిన employee 3.5 lakhs లో 25% మాత్రమే పాక్షిక withdraw కి లెక్కిస్తారు. అనగా 87500 రూ.లు. ఇప్పటి వరకు employee contribute ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక withdraw కి లెక్కించడం లేదు._
*Q5) Partial withdraw కి తప్పకుండా నింపవలసిన ఫార్మ్స్ ఏవి?*
25% withdraw కొరకు 601-pw form నింపి Supported Documents తో సంబంధిత STO కు Submit చేయాలి.
*Q6) CPS ఉద్యోగి 25% withdraw చేయడం వలన భవిష్యత్ లో ఏమైనా సమస్య ఉందా?*
ఎటువంటి సమస్యలేదు.
*Q7) రిటైర్ అయిన CPS ఉద్యోగి తన అకౌంట్ లో ఉన్న మిగిలిన 40% amount total నుండి 25% withdraw చేయవచ్చునా?*
రిటైర్ అయిన cps ఉద్యోగులకు ఎటువంటి partial withdraw సదుపాయం లేదు.
*Q8) 25% partial withdraw ద్వారా వచ్చిన అమౌంట్ ని ఆదాయపు పన్ను ( Income tax ) లో చూపించాలా?*
Income tax కి చూపించనవసరం లేదు. ఇది గతంలో మనం వార్షిక returns లో చూపించిన saving amount ఇది
*Q9) ఒకసారి partial withdrawal చేసిన తరువాత ఎన్ని సంవత్సరాల తరువాత చేయాలి?*
:5 సంవత్సరాల తరువాత...