తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ప్రతిభా ఉపకార వేతన పథకం
(National Means-cum-Merit Scholarship Scheme – NMMS)
2026-27
పరీక్ష 01-11-2026 (ఆదివారం) ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడుతుంది.
ఈ పరీక్ష తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలలో రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో జరుగుతుంది.
అభ్యర్థులు https://bse.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు నమోదు విధానం, పరీక్ష ఫీజు చెల్లింపు, హెడ్‌మాస్టర్లకు సూచనలు, గడువులు మరియు ఇతర మార్గదర్శకాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
*అర్హతలు*
@ 2025–26 విద్యా సంవత్సరంలో 7వ తరగతి వార్షిక పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.
@SC/ST విద్యార్థులకు 50% మార్కులు లేదా సమాన గ్రేడ్ ఉంటే సరిపోతుంది.
@ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉండాలి.
@ప్రభుత్వ, జిల్లా పరిషత్, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని మోడల్ స్కూల్స్ విద్యార్థులు మాత్రమే అర్హులు.
@తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అన్ని వనరుల కలిపి రూ.3,50,000/- లోపు ఉండాలి.
@మండల రెవెన్యూ అధికారి జారీ చేసిన తాజా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి.
@ప్రైవేట్ ఉద్యోగుల విషయంలో యజమాని జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి.
@BC/SC/ST అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి.
@PH అభ్యర్థులు జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రాన్ని ఆన్‌లైన్ దరఖాస్తుతో అప్‌లోడ్ చేయాలి.
@ Original 7వ తరగతి ఉత్తీర్ణత మెమో ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో సమర్పించాలి.
*క్రింది పాఠశాలల విద్యార్థులు అర్హులు కారు:*
# తెలంగాణ రెసిడెన్షియల్ హై స్కూల్స్
# తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్
# తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్
# తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్
# ప్రభుత్వ ఆశ్రమ హై స్కూల్స్
# కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs)
# కేంద్రీయ విద్యాలయాలు
# జవహర్ నవోదయ విద్యాలయాలు
# రెసిడెన్షియల్ సౌకర్యం ఉన్న ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు
# సైనిక్ స్కూల్స్
# రెసిడెన్షియల్ సౌకర్యం ఉన్న ప్రభుత్వ పాఠశాలలు
*పరీక్ష ఫీజు*
OC/BC విద్యార్థులు – రూ.100/-
SC/ST/PH విద్యార్థులు – రూ.50/-
ఫీజు SBI Collect ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
*ముఖ్యమైన తేదీలు*
ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు మరియు పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 24-08-2026
దరఖాస్తు ప్రింట్ కాపీలు, నామినల్ రోల్స్, ఫీజు రసీదులు మొదలైనవి హెడ్‌మాస్టర్ ద్వారా DEO కార్యాలయానికి సమర్పించాల్సిన చివరి తేదీ: 01-09-2026
హెడ్‌మాస్టర్లు ధృవీకరించిన నామినల్ రోల్స్, SBI Collect రసీదులను DEOలు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి పంపాల్సిన చివరి తేదీ: 07-09-2026.
DOWNLOAD :
