ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమం
3వ తేదీ నుండి 17వ తేదీ వరకు స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్
*కార్యక్రమ లక్ష్యాలు:*
*👉బడి ఈడు పిల్లల గుర్తింపు- సమీప పాఠశాలల్లో నమోదు చేయడం*
*👉ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచడం మరియు గుణాత్మక విద్యను అందించడం*
*👉సమాజ భాగస్వామ్యం, మద్దతుతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం*
*👉అంగన్వాడీ కేంద్రాలలో 5+ పిల్లలను గుర్తించి సమీప పాఠశాలలో నమోదు చేయించడం*
*👉విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్డేట్ చేసుకోవడం*
*👉5వ తరగతి/7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత తరగతుల్లో నమోదు చేయించడం(100% బదిలీ-నమోదు)*
*👉తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలో ప్రత్యేక ప్రణాళిక ద్వారా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నమోదు పెంచడం*
*👉బడిబయటి పిల్లలను గుర్తించి వారి వయస్సుకు తగిన తరగతిలో నమోదు చేయడం*
*👉బాలికా విద్య యొక్క ప్రాముఖ్యత పై ప్రత్యేక శ్రద్ధ వహించి బాలికలు అందరినీ పాఠశాలల్లో నమోదు చేయించాలి*
*మార్గదర్శక ఉత్తర్వులలో తెలిపిన విధంగా......
💥పాఠశాల స్థాయిలో జూన్ 1వ తేదీన
సన్నాహక సమావేశం నిర్వహించుకోవాలి.
కార్యక్రమ ప్రణాళిక తయారు చేసుకోవాలి.
బడిబాట నిర్వహణకు అవసరమైన కరపత్రాలు, బ్యానర్ తదితర ఏర్పాట్లు చేసుకోవాలి.
💥 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు అన్ని గ్రామాలు/ఆవాస ప్రాంతాలలో ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించాలి
💥 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్ధారించిన రోజూవారీ కార్యక్రమాలు నిర్వహించాలి
ఈ కార్యక్రమాల నిర్వహణకు ఆర్ధిక వనరులను పాఠశాల నిధుల నుండి ఖర్చు చేయాలి
బడిబాట విజయవంతంగా నిర్వహించి అధికంగా విద్యార్థులను నమోదు చేసిన పాఠశాలలను జిల్లాస్థాయిలో 3, రాష్ట్రస్థాయిలో 10 పాఠశాలలను ఎంపిక చేసి సన్మానించడం జరుగుతుంది.
💥 *మార్గదర్శక ఉత్తర్వులు*💥
*👉జూన్ 1వ తేదీన పాఠశాల స్థాయిలో ప్రజాప్రతినిధులతో, సంబంధిత విభాగాలతో సమన్వయ సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి*
👉 *గ్రామసభ:* *జూన్ 1వ తేదీనే SMC సభ్యులు, తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయంసహాయక సంఘాలు, ఆశ కార్యయకర్తలతో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి బడిబాట లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి*
*👉పాఠశాల స్థాయి రోజూవారీ కార్యాచరణ రూపొందించుకోవాలి*
*3వ తేదీ నుండి 9వ తేదీ వరకు విద్యార్థుల నమోదు కార్యక్రమం (ఉదయం 7గం. నుండి 11 గం. వరకు) ఈక్రింద సూచించిన కార్యక్రమాలు నిర్వహించాలి*
*A)డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలు: గ్రామం/సమాజం లోని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతిరోజూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, SMC సభ్యులతో ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించాలి*
*B)మనఊరు-మనబడి, ఇంగ్లీష్ మీడియం, FLN తడితరాలైన రాష్ట్ర ప్రభుత్వ పథకాల పట్ల తల్లిదండ్రులు, సమాజంలో చైతన్యం కలిగించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా ప్రోత్సహించాలి*
*C)అంగన్వాడీ కేంద్రాలలో అర్హత కలిగిన పిల్లలను పాఠశాలల్లో 1వ తరగతిలో చేర్పించే విధంగా అంగన్వాడీ వారితో సమన్వయం చేసుకోవాలి*
*D) బాడీఈడు పిల్లలు, బడి మానివేసిన, లాంగ్ ఆబ్సెంటీలను స్వయం సహాయక సంఘాల వారి సహాయంతో గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి అమలు చేయాలి*
*E) CWSN పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలు/భవిత కేంద్రాలలో నమోదు చేయించాలి*.
*F)5+ నుండి 14 సం. బడిబయటి పిల్లలను గుర్తించి (లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి) పాఠశాలల్లో నమోదు చేసుకోవాలి*
*G) బాలకార్మికులను గుర్తించి పాఠశాలలో నమోదు చేసుకోవాలి*
*H) సమీప UP/HS పాఠశాలల ప్రధానోపాధ్యాయలకు 5వ/7వ తరగతి పిల్లల బదిలీ నమోదు పై సమాచారం అందించాలి*
*I)బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రుల, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలి*
*J) గ్రామవిద్య రిజిస్టర్ ను నవీకరణ చేసుకోవాలి*.
*K) పిల్లల్లో పాఠశాల మరియు విద్య పట్ల ఆసక్తి కలిగేలా సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి*