PTM Guidelines

మండల విద్యాధికారులకు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది.

*గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ & ఎక్స్- అఫీషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష, తెలంగాణ, హైదరాబాద్ గారి ఆదేశాల ప్రకారం ది.15.07.2023న మూడవ శనివారం సందర్బంగా, అన్ని ప్రభుత్వ & స్థానిక సంస్థల పాఠశాలల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం (PTM) నిర్వహించవలెనని ఆదేశించనైనది.*

*PTM నిర్వహణపై సూచనలు* 

*ప్రధానోపాధ్యాయులు ఈ సందర్భంగా ఈ క్రింది విషయాలపై దృష్టి సారించాలి.*

*i) పిల్లల విద్యాపరమైన ఎదుగుదలకు తల్లిదండ్రుల పాత్ర అతి కీలకం. కావున తల్లిదండ్రుల హాజరు 100% ఉండేటట్టుగా చూడటం.*

*ii) ప్రధానోపాధ్యాయులు ముందుగానే పాఠశాల విద్యార్థుల ద్వారా వ్రాతపూర్వకంగా , ఆహ్వానం పంపడం ద్వారా తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం అందించాలి.*

*iii) PTMలకు ఇప్పటివరకు హాజరు కాని తల్లిదండ్రులపై HMs ప్రత్యేకంగా దృష్టి సారించి, వారు తప్పకుండా హాజరయ్యేటట్టు చూడాలి.*

*iv) గ్రామీణ ప్రాంతంలో చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండటం . పట్టణ ప్రాంతాల్లో ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటం వల్ల, తల్లిదండ్రులు సమావేశానికి హాజరయ్యేలా చేయడానికి, వారికి అనుకూలమైన సమయానికి పి. టీ. ఎం లను నిర్వహించవలెనని సూచించనైనది.*

*v) ప్రధానోపాధ్యాయులు PTM సమావేశ విషయాలను రికార్డ్ (మినిట్స్ )చేయాలి.*

*కావున మండల విద్యాశాఖాధికారులు జులై నెలకు గాను ది.15.07.2023 న జరగనున్న పేరెంట్ టీచర్ మీటింగ్‌ ను విజయవంతంగా నిర్వహించేందుకు, అన్ని ప్రభుత్వ & స్థానిక సంస్థల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలను అందించవలసిందిగా తెలియజేయనైనది.* 

*(ఇది అత్యంత ప్రాధాన్యత గల అంశం గా భావించగలరు.)*

Download: