PTM Guidelines

మండల విద్యాధికారులకు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది.

*గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ & ఎక్స్- అఫీషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష, తెలంగాణ, హైదరాబాద్ గారి ఆదేశాల ప్రకారం ది.15.07.2023న మూడవ శనివారం సందర్బంగా, అన్ని ప్రభుత్వ & స్థానిక సంస్థల పాఠశాలల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం (PTM) నిర్వహించవలెనని ఆదేశించనైనది.*

*PTM నిర్వహణపై సూచనలు* 

*ప్రధానోపాధ్యాయులు ఈ సందర్భంగా ఈ క్రింది విషయాలపై దృష్టి సారించాలి.*

*i) పిల్లల విద్యాపరమైన ఎదుగుదలకు తల్లిదండ్రుల పాత్ర అతి కీలకం. కావున తల్లిదండ్రుల హాజరు 100% ఉండేటట్టుగా చూడటం.*

*ii) ప్రధానోపాధ్యాయులు ముందుగానే పాఠశాల విద్యార్థుల ద్వారా వ్రాతపూర్వకంగా , ఆహ్వానం పంపడం ద్వారా తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం అందించాలి.*

*iii) PTMలకు ఇప్పటివరకు హాజరు కాని తల్లిదండ్రులపై HMs ప్రత్యేకంగా దృష్టి సారించి, వారు తప్పకుండా హాజరయ్యేటట్టు చూడాలి.*

*iv) గ్రామీణ ప్రాంతంలో చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండటం . పట్టణ ప్రాంతాల్లో ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటం వల్ల, తల్లిదండ్రులు సమావేశానికి హాజరయ్యేలా చేయడానికి, వారికి అనుకూలమైన సమయానికి పి. టీ. ఎం లను నిర్వహించవలెనని సూచించనైనది.*

*v) ప్రధానోపాధ్యాయులు PTM సమావేశ విషయాలను రికార్డ్ (మినిట్స్ )చేయాలి.*

*కావున మండల విద్యాశాఖాధికారులు జులై నెలకు గాను ది.15.07.2023 న జరగనున్న పేరెంట్ టీచర్ మీటింగ్‌ ను విజయవంతంగా నిర్వహించేందుకు, అన్ని ప్రభుత్వ & స్థానిక సంస్థల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలను అందించవలసిందిగా తెలియజేయనైనది.* 

*(ఇది అత్యంత ప్రాధాన్యత గల అంశం గా భావించగలరు.)*

Download:


Utilisation of School Grants - Guidelines

*📡💰 స్కూల్ వార్షిక గ్రాంట్(2023-2024) వినియోగం కోసం మార్గదర్శకాలు:✍️⬇️*

◼️ప్రభుత్వ, ZP/MPP, మోడల్ స్కూల్స్, TWPS మరియు ఇతర పాఠశాలలు  కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఈ క్రింది విధంగా మంజూరు అయినది.
◼️స్థిరమైన అంటే సుద్ద ముక్కలు, తెల్ల కాగితాలు, రిజిస్టర్లు మొదలైనవి అందించడం,మరియు పరీక్షల నిర్వహణ. జాతీయ పండుగలు అనగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడానికి గ్రాంట్లను ఉపయోగించడం మరియు గణతంత్ర దినోత్సవం మొదలైనవి.

◼️విద్యుత్ & ఇంటర్నెట్ ఛార్జీల చెల్లింపు.

◼️కంప్యూటర్లు, ప్రొజెక్టర్, K-Yan, TV, ROT మొదలైన వాటికి మరమ్మతులు. కేబుల్, ఇంటర్నెట్ ఛార్జీలు మరియు డిజిటల్ తరగతులకు సంబంధించిన ఇతర ఖర్చులు.

◼️సైన్స్ ల్యాబ్ కోసం తినుబండారాలు/ రసాయనాలు మొదలైన వాటి కొనుగోలు

◼️ప్రయోగశాల పరికరాల భర్తీ మరియు మరమ్మత్తు.

◼️తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ మొదలైన వాటికి చిన్న మరమ్మతులకు మొదలైన వాటికి వినియోగించడం

◼️ త్రాగునీటిని అందించడం

◼️పాఠశాలల శానిటైజేషన్ మరియు టాయిలెట్ల నిర్వహణ కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించవచ్చు

◼️హ్యాండ్ వాష్ మరియు టాయిలెట్ కోసం సబ్బు ద్రవ కొనుగోలు కోసం 10% గ్రాంట్ ఉపయోగించాలి. "స్వచ్ఛ కార్యాచరణ ప్రణాళిక"లో భాగంగా క్లీనింగ్ మెటీరియల్.

◼️మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం క్రీడా సామగ్రిని కొనుగోలు చేయాలి.

*💥సాధారణ మార్గదర్శకాలు:*

*➡️SMC పైన పేర్కొన్న అంశాలపై గ్రాంట్‌లను ఉపయోగించేందుకు తీర్మానాలు చేయాలి మరియు తీర్మానాలు తదనుగుణంగా నిర్వహించబడతాయి.

*➡️గ్రాంట్ల వినియోగంపై SMC ద్వారా సోషల్ ఆడిట్ చేయబడుతుంది.

*➡️సేకరించిన వస్తువులకు స్టాక్ మరియు ఇష్యూ రిజిస్టర్లలలో నమోదు చేయాలి.

*➡️అందుబాటులో ఉన్న ఖర్చు మరియు నిల్వలు నోటీసు బోర్డులో ప్రదర్శించాలి 
             
 *➡️గ్రాంట్ల వినియోగంపై చర్చ నెలవారీ SMC సమావేశాలలో నిర్వహించబడుతుంది.*

*➡️అన్ని లావాదేవీల కోసం నగదు పుస్తకం మరియు వోచర్లు భద్రపరచాలి.
        
 *➡️పాఠశాల స్థాయిలో మార్గదర్శకాల ప్రకారం గ్రాంట్ల వినియోగానికి ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహిస్తారు.*
       
*➡️DEO సిబ్బంది మరియు MEO గ్రాంట్ల వినియోగాన్ని పర్యవేక్షిస్తారు.

Download:

EMRS Job Notification

*🔊Teacher Jobs: ఏకలవ్య స్కూళ్లలో 4,062 ఉద్యోగాలు.. భారీగా వేతనం*

*💠EMRS Job notification: ఏకలవ్య పాఠశాలల్లో పోస్టులకు భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌విడుదలైంది. జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.*

*🍥 దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో(EMRS) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 4,062 టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(NESTS) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు జులై 31వరకు https://emrs.tribal.gov.in/   వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.*

*💥నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

*♦️మొత్తం ఖాళీలు 4,062  
 ప్రిన్సిప‌ల్‌-303; 
పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ)-2266; అకౌంటెంట్‌-361; 
జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జేఎస్‌ఏ)- 759; ల్యాబ్‌ అటెండెంట్‌-373 

*♦️అర్హతలు: ప్రిన్సిపల్‌ పోస్టులకు బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. కనీసం 12 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించరాదు. నెలకు రూ.78800-రూ.209200 చెల్లిస్తారు.*

*♦️పీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 40 ఏళ్లు మించరాదు. నెలకు రూ.47600-రూ.151100 చెల్లిస్తారు.*

*♦️అకౌంటెంట్‌ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత . వయసు 30 ఏళ్లు మించొద్దు. నెలకు రూ.35400-రూ.112400 చెల్లిస్తారు. 
*జేఎస్‌ఏ ఉద్యోగాలకు సీనియర్‌ సెకండరీ ఉత్తీర్ణులైతే చాలు. వయసు 30 ఏళ్లు మించరాదు. రూ.19900-రూ.63200 చెల్లిస్తారు. 
*ల్యాబ్‌ అటెండెంట్‌ ఉద్యోగాలకు 10/12వ తరగతి పాసైతే చాలు. వేతనం రూ.18000-రూ.56,900గా పేర్కొన్నారు.*

*♦️ఎంపిక విధానం: ఓఎంఆర్‌ బేస్డ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.*

*♦️దరఖాస్తు రుసుం: ప్రిన్సిపల్‌: రూ.2000; పీజీటీ: రూ.1500; నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌: రూ.1000 చొప్పున నిర్ణయించారు.*