Staff Selection commission 2023 Notification




*ఎస్‌ఎస్‌సీ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్*

        *దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

@    ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌, లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, అకౌటెంట్‌, రీసెర్చి ఇన్వెస్టిగేటర్‌,  టెక్నికల్‌ అసిస్టెంట్‌ సహా మొత్తం 5,369 ఉద్యోగాల సోమవారం (మార్చి 6) నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

@     ఆయా ఉద్యోగాలను బట్టి మెట్రిక్యులేషన్‌ మొదలుకొని గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


*ముఖ్యాంశాలివే..*

@    మొత్తం ఉద్యోగ ఖాళీలు: 5,369; అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
 
@    వయస్సులో  సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

@    ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ డేటాఎంట్రీ టెస్ట్‌/ కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

@    పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్‌ (25 ప్రశ్నలకు 50 మార్కులు);  జనరల్‌ అవేర్‌నెస్‌ (25 ప్రశ్నలు- 50 మార్కులు); క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు 50 మార్కులు), ఇంగ్లిష్‌ (25 ప్రశ్నలు 50 మార్కులు) చొప్పున ఉంటాయి.  ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.*

@    మార్చి 6 నుంచి 27వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. మార్చి 28 రాత్రి 11గంటల వరకు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

@     దరఖాస్తుల్లో పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు ఏప్రిల్‌ 3 నుంచి 5వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.

@     కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను జూన్‌- జులై మాసాల్లో నిర్వహించే అవకాశం ఉంది.
 
@    దరఖాస్తు ఫీజు: రూ.100. భీమ్‌ యూపీఐ, నెట్‌బ్యాంకింగ్‌, క్రెడిట్‌/డెబిట్కార్డుల ద్వారా చెల్లించవచ్చు.

@    తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

@    Website : https://ssc.nic.in/

Download :