DSE Instructions on SSC Examinations April 2023

Instructions on SSC Examinations April 2023

 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ,హైదరాబాద్ గారి సూచనలు


1."ఈ ప్రాంతము సీసీ కెమెరా పర్య వేక్షణ లో వుంది" అని ఫ్లెక్సీ పెట్టాలి

మరో ఫ్లెక్సీ లో DEO, MEO, POLICE వారి నంబర్స్ ఉండాలి 

2.సీసీ కెమెరాలు working condition లో వున్నాయా లేవా చెక్ చేసుకోవాలి(ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ లో అప్పటికే అమర్చి వున్న CC కెమెరాలు )

3.CS,DO, ఇన్విజిలేటర్, స్క్వాడ్, స్టూడెంట్స్,water boy, అటెండర్  లకు ఎవరికి కూడా మొబైల్ ఫోన్ అనుమతి లేదు.

4. ఫర్నీచర్, drinking water,light ,fan ,బెంచెస్,washroom లు అన్నీ సరిగ్గా వున్నాయా,లేవా చెక్ చేసుకోవాలి.

5. ఇన్విజిలేటర్ లు ప్రతి రోజు  ఉదయం 8.45 కే పరీక్ష సెంటర్ కు చేరుకోవాలి.

6.ఇన్విజిలేటర్ లకు ఒకటి లేదా రెండు రోజుల ముందే డిటైల్డ్ గా శిక్షణ ఇచ్చి, వారి సంతకాలు శిక్షణ తీసుకున్నట్లుగా తీసుకోవాలి. రక్త సంబదీకులు పరీక్ష సెంటర్ లో ఎవరూ లేరని డిక్లరేషన్ తీసుకోవాలి 


7. ఇన్విజిలేటర్ యొక్క విధులు సూచనలను ప్రతి ఇన్విజిలేటర్ కు వివరించి ఒక కాపీ ఇచ్చి సంతకం తీసుకోవాలి.

8.పరీక్షలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఫోటో ఐడి కార్డ్స్ ప్రతి రోజూ వుండాలి

9.జవాబు పత్రాలను పాలిథిన్ కవర్ లో పెట్టి మంచి బట్టతో కుట్టి  అడ్రస్ మరియు పేపర్ CODE మరియు  CS మొబైల్ నంబర్ కరెక్ట్ గా రాయాలి.

10. పోలీస్ స్టేషన్ నుంచి పేపర్ ను ఒక సంచిలో జాగ్రత్తగా సెంటర్ కు తీసుకొని వెళ్ళాలి

11.OMR లను చెక్ చేసుకోవాలి

12.సెంటర్ లో గోడల మీద ఫార్ములాలు కానీ maps కానీ వుంటే వేరే పేపర్ తో కనబడకుండా కవర్ చేయాలి

13.మెయిన్ షీట్ నంబర్ ను అన్ని additional పేపర్, map,graph, part -B పైన  రాయించాలి.

14. PART-B, గ్రాఫ్,map అన్నీ tag చేసినార లేదా ప్రతి రోజూ చెక్ చేసుకోవాలి

15.PH పిల్లలకు ఒక గంట సమయాన్ని అదనంగా ఇవ్వాలి (వారు అడిగితే) pl refer concerned GO

16. బఫర్ OMR వాడితే యే రోజు కారోజు వాటి నంబర్ రాయాలి, కానీ from నంబరు-TO నంబర్ రాయకూడదు
Stationery a/c maintain చెయ్యాలి 

17. vocational పేపర్ ల మీడియం ను చెక్ చేసుకోవాలి.పేపర్ కోడ్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి 

18. Once failed విద్యార్థుల పేపర్ లను సపరేట్ గా క్యాంప్ కు పంపాలి. 
వాటిని రెగ్యులర్ పిల్లల పేపర్ తో కలపకూడదు.

19.  TIMINGS

** 03T/4S మరియు SCIENCE పేపర్ లకు 9.30 am నుండి 12.50pm వరకు నిర్వహించాలి .

03Tసమయం=
9.30-11.30
04S సమయం=
11.50-12.50

**Physical science
9.30-11.00

Bio. science
11.20-12.50

మిగతా పేపర్లు అనగా 1st లాంగ్వేజ్,second language,3rd language , మాథ్స్,సోషల్ అన్నియు 9.30 -12.30 వరకు నిర్వహించాలి

20.PART -B

ఇంగ్లిష్ PART-A మరియు పార్ట్- B రెండు ఒకటే సారి అనగా 9.30am కు ఇవ్వాలి.మరియు part-B ని మెయిన్ answer sheet తో కట్టాలి. చెక్ చెయ్యాలి, కొందరు విద్యార్డులు హడావిడిలో part-B సరిగా కట్టరు - చూసుకోవాలి 

**Physical science మరియు Bio science part -B లను చివరి 15 నిమిషాల ముందు ఇవ్వాలి. అనగా phy.sc. Part-B నీ 10.45amకి

Bio.sc. part-B నీ  12.35 pm కి ఇవ్వాలి.

Staff Selection commission 2023 Notification




*ఎస్‌ఎస్‌సీ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్*

        *దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

@    ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌, లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, అకౌటెంట్‌, రీసెర్చి ఇన్వెస్టిగేటర్‌,  టెక్నికల్‌ అసిస్టెంట్‌ సహా మొత్తం 5,369 ఉద్యోగాల సోమవారం (మార్చి 6) నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

@     ఆయా ఉద్యోగాలను బట్టి మెట్రిక్యులేషన్‌ మొదలుకొని గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


*ముఖ్యాంశాలివే..*

@    మొత్తం ఉద్యోగ ఖాళీలు: 5,369; అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
 
@    వయస్సులో  సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

@    ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ డేటాఎంట్రీ టెస్ట్‌/ కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

@    పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్‌ (25 ప్రశ్నలకు 50 మార్కులు);  జనరల్‌ అవేర్‌నెస్‌ (25 ప్రశ్నలు- 50 మార్కులు); క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు 50 మార్కులు), ఇంగ్లిష్‌ (25 ప్రశ్నలు 50 మార్కులు) చొప్పున ఉంటాయి.  ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.*

@    మార్చి 6 నుంచి 27వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. మార్చి 28 రాత్రి 11గంటల వరకు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

@     దరఖాస్తుల్లో పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు ఏప్రిల్‌ 3 నుంచి 5వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.

@     కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను జూన్‌- జులై మాసాల్లో నిర్వహించే అవకాశం ఉంది.
 
@    దరఖాస్తు ఫీజు: రూ.100. భీమ్‌ యూపీఐ, నెట్‌బ్యాంకింగ్‌, క్రెడిట్‌/డెబిట్కార్డుల ద్వారా చెల్లించవచ్చు.

@    తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

@    Website : https://ssc.nic.in/

Download :

TS Polytechnic Notification 2023




తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023

@    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్‌లలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. 

@    విద్యార్థులు జ‌న‌వ‌రి 16 నుంచి ఏప్రిల్‌ 24 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 

@    మే 17న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌) సీట్లను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.  

@    కోర్సులు అందించే సంస్థలు/ విశ్వవిద్యాలయాలు: ప్రభుత్వ/ ఎయిడెడ్‌/ అన్‌ఎయిడెడ్‌ పాలిటెక్నిక్స్‌/ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ డిప్లొమా. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్‌ డిప్లొమా. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్‌ డిప్లొమా.

వివరాలు:

#    తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023

#    అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 

#    పరీక్ష ఫీజు: రూ.500, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250.

ముఖ్యమైన తేదీలు… 

#    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16-01-2023.

#    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 24-04-2023.

#    ఆలస్య రుసుము రూ.100తో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 25-04-2023.

#    పరీక్ష నిర్వహణ తేదీ: 17-05-2023.

website : 

Download :