@ Unmarried certificate for Transfers
@ NCC Certificate for Transfers
@ Spouse Certificate for Transfers
@ User Manual for TS Teachers Transfers 2023
@ Roaster Points and Seniority in Promotions
@ Promotions Adhoc Service Rules
@ GOs
ఉపాధ్యాయ బదిలీలు 2023 మార్గదర్శకాలు
➡️ అన్ని క్యాడర్ల ఉపాధ్యాయ బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే జరుగుతాయి.NCC స్పెషల్ ఆఫీసర్ లు గా ఉన్న వారికి మాత్రం MANUAL పద్దతిలో జరుగుతాయి.
➡️మినిమం సర్వీస్ 01-02-2023 నాటికి రెండు సంవత్సరాలు పూర్తయి ఉండాలి.
➡️ 01-02-2023 నాటికి ఒక స్టేషన్లో గరిష్టంగా ప్రధానోపాధ్యాయులకు ఐదు సంవత్సరాలు మిగతా అన్ని క్యాడర్ల కు 8 సంవత్సరాలు పూర్తయితే వారి స్థానాలు ఖాళీగా చూపించబడతాయి. వారు తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కు అప్లై చేసుకోవాలి చేసుకోకపోతే బదిలీలు పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీలను వారికి కేటాయిస్తారు.
➡️ పదవి విరమణ కు మూడు(03) సంవత్సరాల లోపు ఉంటే వారిని అదే స్టేషన్లో కొనసాగిస్తారు. వారు కోరుకుంటేనే బదిలీ చేస్తారు.
➡️ బదిలీలు అన్నీ కూడా ప్రస్తుతం వారు పనిచేస్తున్న మేనేజ్మెంట్ వారిగానే జరుగుతాయి.
➡️ ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాల సర్వీస్ కు 17% HRA మరియు ఆ పైన పొందుతున్న వారికి సంవత్సరమునకు ఒక (01) పాయింట్.ఇస్తారు.
➡️ 13% HRA పొందుతున్న వారికి సంవత్సరమునకు రెండు (02) పాయింట్లు ఇస్తారు.
➡️ 11% హెచ్ఆర్ఏ పొందుతున్న వారికి సంవత్సరమునకు మూడు (03) పాయింట్లు కేటాయిస్తారు.
➡️ నాలుగవ కేటగిరి లేదు
➡️ అన్ని క్యాడర్లలో చేసిన మొత్తం సర్వీస్ పూర్తి అయిన ప్రతి నెలకు 0.41పాయింట్ కేటాయిస్తారు.
➡️ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాల రాష్ట్ర జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కు పది(10) పాయింట్లు కేటాయిస్తారు
➡️ అవివాహత మహిళా ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు పది(10) పాయింట్లు కేటాయిస్తారు.
➡️ స్పౌజ్ లకు 10 పాయింట్స్ ఇస్తారు. స్పోర్ట్స్ పాయింట్లు పొందినవారు వారి spouse కు దగ్గరలో గల ఖాళీలను మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులు అయితే ఒకరు మాత్రమే ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలి.5/8 సంవత్సరములలో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాలి.
ప్రాధాన్యత కేటగిరీలు
(a). 70 శాతం తక్కువ కాకుండా వికలాంగులైన వారికి సదరం సర్టిఫికెట్ లేదా మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికెట్ పొందిన వారికి బదిలీల లో మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
(b) వితంతువుల కు బదిలీలలో రెండవ ప్రాధాన్యత ఇస్తారు.
(c) తిరిగి వివాహం చేసుకో నటువంటి లీగల్ గా విడిపోయిన మహిళలకు మూడవ ప్రాధాన్యత ఇస్తారు.
(d) క్రింది జబ్బులతో వారు గాని లేదా వారి యొక్క స్పోజ్ గాని బాధపడుతుంటే వారికి. 4 వ ప్రాధాన్యత ఇస్తారు.
i. క్యాన్సర్
ii. ఓపెన్ హార్ట్ సర్జరీ
iii. న్యూరో సర్జరీ
iv. బోన్ టీబి.
v. కిడ్నీ లేదా లివర్ లేదా హార్ట్ మార్పిడి
vi. కిడ్నీ డయాలసిస్
(e) మానసిక వైకల్యం గల లేదా లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) తల సేమియా లేదా మస్కులర్ డిస్ట్రోఫీ తో చికిత్స పొందుతున్న పిల్లలు గల వారికి
(f) పుట్టుకతో గుండెలో రంధ్రముగల పిల్లలు కలవారి కి వైద్య సదుపాయం అందుబాటు గల ప్రాంతానికి పొందటానికి అవకాశం ఉంటుంది.
(g) పుట్టుకతోనే షుగర్ వ్యాధి గల పిల్లల కలవారికి
గమనిక 1: పైన పేర్కొన్న d,e,f &g వారు 01-01-2021 న కానీ తరువాత కానీ జిల్లా మెడికల్ బోర్డు లేదా స్టేట్ మెడికల్ బోర్డు నుండి పొందిన సర్టిఫికెట్ ప్రూఫ్ గా చూపించాలి
గమనిక 2:: ప్రిఫరెన్షియల్ కేటగిరి గాని లేదా స్పెషల్ పాయింట్స్ గాని తీసుకున్నవారు ప్రధానోపాధ్యాయులు అయితే 5 సంవత్సరములకు ఒకసారి, ఇతర క్యాడర్ల ఉపాధ్యాయులు అయితే 8 సంవత్సరములకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. వాటిని సేవాగ్రంధంలో నమోదు చేయాలి.
గమనిక 3:: పైన పేర్కొన్న e,f,g ల విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులు అయితే ఎవరో ఒకరు మాత్రమే ఉపయోగించుకోవాలి.
గమనిక 4:: పైన పేర్కొన్న b మరియు c విషయంలో సరైన ఆధారాలు చూపించాలి.
➡️ ఒక ఉపాధ్యాయుడు ఒక అప్లికేషన్ మాత్రమే నియమిత ప్రొఫార్మాలో వెబ్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో నింపాలి.
➡️ వెబ్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో నింపిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసి ఎంఈఓ లేదా హైస్కూల్ ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయానికి పంపాలి.
➡️ తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కావలసినవారు 5/8 సంవత్సరంలో సర్వీస్ పూర్తయిన వారి ఖాళీలన్నీ వెబ్ కౌన్సిలింగ్ సైట్ లో చూపుతారు.
➡️ వీటితోపాటు వివిధ కారణాలతో లీవ్ లో ఉన్న వారి ఖాళీ మరియు జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లోని ఖాళీలను చూపించరు.
🔷 ఈ క్రింద పేర్కొన్న లిస్టులను ఆర్జెడి కార్యాలయం ముందు మరియు డీఈఓ కార్యాలయం ముందు ప్రదర్శిస్తారు.
1.I,II మరియు III కేటగిరీలలో గల పాఠశాలల వివరాలు.
2. పాఠశాల వారి ఖాళీ ల వివరాలు.
3. బదిలీకి అప్లై చేసుకున్న అందరూ ఉపాధ్యాయుల ఇన్ టైటిల్మెంట్ పాయింట్స్ కేడర్ వారీగా ఇస్తారు.
🔷 అబ్జెక్షన్ ఏమైనా ఉంటే తగిన ఆధారాలతో షెడ్యూల్ లో ఇచ్చిన టైం ప్రకారం ఆర్ జెడి కి గాని డీఈవోకు గాని అప్లై చేసుకోవాలి.
🔷 ఒక పంచాయతీలో గల ఒక హాబిటేషన్లో 5/8 సంవత్సరముల సర్వీసు పూర్తయిన వారు మరల అదే పంచాయతీలో గల మరో పాఠశాలకు ఆప్షన్ ఇవ్వకూడదు.
🔷 ఒకసారి వెబ్ కౌన్సిలింగ్ లో పాల్గొన్న తర్వాత పాఠశాల అలాట్మెంట్ జరిగి బదిలీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు.
🔷 వెబ్ కౌన్సిలింగ్ లో బదిలీ ఉత్తర్వులు పొందిన వారు 23-4-2023 న
పాఠశాలలు నుండి రిలీవ్ అయి 24-4-2023న కొత్త పాఠశాలలో జాయిన్ కావాలి.
🔷 వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి.
🔷 బదిలీ ఉత్తర్వులలో ఏమైనా అసంబద్ధతలు చోటు చేసుకుంటే బదిలీ ఉత్తర్వులు అందిన 10 రోజులలోగా పై అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలి. వారు 15 రోజుల్లోగా ఆ ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తారు.
DOWNLOAD :