*🔵 వాట్సాప్ సర్వీస్‌ను లాంఛ్ చేసిన ఎల్ఐసీ..పాలసీ వివరాలు తెలుసుకోండిలా..!*
*: ఎల్ఐసీ తన పాలసీదారుల కోసం తొలి ఇంటరాక్టివ్ వాట్సాప్ సర్వీసులను ప్రారంభించింది. ఎల్ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదుచేసుకున్న పాలసీదారులు ఈ వాట్సాప్ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ సర్వీస్ ద్వారా పాలసీదారులు తమ పాలసీల వివరాలను, యులిప్ ప్లాన్ స్టేట్‌మెంట్ సహా పలు సమాచారాన్ని, సేవలను ఎల్ఐసీ అఫిషియల్ వాట్సాప్ చాట్‌చాక్స్ ద్వారా పొందే వెసులుబాటు ఉంది.*
*🌀ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా సేవలు పొందగోరు పాలసీదారులు ఆన్‌లైన్‌లో ఇప్పటివరకూ తమ పాలసీలను నమోదు చేయకుంటే తక్షణమే రిజిస్టర్ చేసుకోవాలని ఎల్ఐసీ ఓ ప్రకటనలో కోరింది. ఇక ఎల్ఐసీ వాట్సాప్ సేవలు పొందేందుకు తొలుత కస్టమర్లు తమ ఫోన్‌లో ఎల్ఐసీ వాట్సాప్ నెంబర్ 8976862090ను సేవ్ చేసుకోవాలి.*
*💠వాట్సాప్ ఓపెన్ చేసి ఎల్ఐసీ వాట్సాప్ చాట్ బాక్స్‌లోకి వెళ్లి ఆపై చాట్ బాక్స్‌లో హాయ్ అని టైప్ చేస్తే ఎల్ఐసీ చాట్‌బోట్ కస్టమర్‌కు 11 ఆప్షన్స్‌ను చూపి వాటిలో ఎంచుకోవాలని కోరుతుంది. ఇందులో కస్టమర్ కోరిన నెంబర్ ఆధారంగా ఆయా సమాచారాన్ని ఎల్ఐసీ షేర్ చేస్తుంది. ఈ ఆప్షన్స్‌లో ప్రీమియం తేదీ, బోనస్ సమాచారం, పాలసీ స్టేటస్, లోన్ ఎలిజిబిలిటీ వివరాలు, రుణానికి చెల్లించాల్సిన వడ్డీ, యులిప్ యూనిట్స్ స్టేట్‌మెంట్, ఎల్ఐసీ సర్వీస్ లింక్స్ వంటి కస్టమర్ కోరిన సమాచారాన్ని కంపెనీ అందచేస్తుంది.*