SSA Sectorial Officers Recruitment Notification 2022


SSA Sectorial Officers Recruitment Notification 2022

*జిల్లా DEO office లలోని SSA లో కోఆర్డినేటర్ల(సెక్టోరల్ ఆఫీసర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 పోస్టులు:
1.ప్లానింగ్ కోఆర్డినేటర్ 
2.క్వాలిటీ కోఆర్డినేటర్
3.జెండర్ కోఆర్డినటర్(మహిళలకు మాత్రమే)
4.Inclusive కోఆర్డినటర్
5.అసిస్టన్స్ స్టాటిస్టికల్ కోఆర్డినటర్

*అర్హతలు*
ప్రస్తుతం  ప్రభుత్వ/జిల్లా పరిషత్ పాఠశాలల్లోGHM లేదా S. A లుగా విధులు నిర్వహిస్తున్న వాళ్ళు అర్హులు,స్కూల్ అసిస్టన్స్ సర్వీస్ 5 ఏండ్లు ఉండాలి.

*ఎంపిక*
సులభమైన ప్రశ్నలతో ONLINE టెస్ట్ OBJECTIVE టైప్ ఉంటుంది( పూర్తి వివరాలు కు సైట్: www.samagrashiksha.telangana.gov.in ను సందర్శించండి.

*ప్రాధాన్యత*
 ఫారెన్ సర్వీస్ తో ఒక జిల్లా అధికారి హోదా,మోనిటరింగ్ అధికారం,వెహికల్,T. A, D. A, సమ్మర్ ELS తో అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ తో జిల్లా ముఖ్యపట్నంలో విధుల నిర్వహణ, పనిచేయాలనే తపన,జిల్లాలోని ఉపాధ్యాయులకు సేవ చేయాలనే ఆసక్తి గలవారికి సరైన గుర్తింపు,సంతృప్తినిచ్చే పోస్టు ఇది.

 *దరఖాస్తు తేదీలు*
10.12.2022 నుండి తేదీ 17.12.2022 వరకు.

*దరఖాస్తు విధానం*
 https://www.samagrashiksha.telangana.gov.in/   లో ఆన్లైన్ దరఖాస్తు చెయ్యాలి.

*పరీక్ష*
హాల్ టికెట్లు జారీ మరియు పరీక్ష జనవరి మొదటి వారంలో ఉంటుంది. సంక్రాంతి కల్లా కొత్తవాళ్ళు విధుల్లో చేరాల్సి ఉంటుంది.

DOWNLOAD "




TSPSC JUNIOR LECTURERS NOTIFICATION 2022


TSPSC JUNIOR LECTURERS NOTIFICATION 2022

@    
  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. 

 @ మల్టీజోన్‌-1లో 724, మల్టీజోన్‌-2లో 668 పోస్టులను భర్తీ చేయనుంది.
 
@  కమిషన్‌ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా, తాజాగా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

@ ఈ పోస్టులకు ఈ నెల 16నుంచి 2023 జనవరి 6వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. 

@ పోస్టుల భర్తీకి రాతపరీక్ష 2023జూన్‌ లేదా జులైలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

 @  ఉద్యోగప్రకటన పూర్తివివరాలు, అర్హతల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌


*🔊సివిక్స్‌ జేఎల్‌ పోస్టులకు వారు అర్హులే* 

* సివిక్స్‌ సబ్జెక్టు జూనియర్‌ అధ్యాపకుల కొలువులకు పీజీలో పొలిటికల్‌ సైన్స్‌(పీఎస్‌), పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌(పీఏ)లలో 50 శాతం మార్కులతో పాసైన వారు అర్హులేనని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ జూనియర్‌ అధ్యాపకుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని సందేహాలపై ఆమె స్పష్టత ఇచ్చారు.

     పదో తరగతి వరకు ఉర్దూ/మరాఠీ లేదా పదో తరగతిలో ప్రథమ భాషగా చదివినా లేదా డిగ్రీలో ద్వితీయ భాషగా వాటిని చదివిన వారు ఉర్దూ/మరాఠీ మాధ్యమంలో అధ్యాపకుల కొలువులకు అర్హలవుతారని పేర్కొన్నారు.*



DOWNLOAD :



 @     6th to 10th Class Subject wise Video Lessons & Study Material :

            * 10th Class

            *  9th Class

            *  8th Class

            *  7th Class

            *  6th Class




Get LIC Policy Details through WhatsApp

*🔵 వాట్సాప్ స‌ర్వీస్‌ను లాంఛ్ చేసిన ఎల్ఐసీ..పాల‌సీ వివ‌రాలు తెలుసుకోండిలా..!*

*: ఎల్ఐసీ త‌న పాల‌సీదారుల కోసం తొలి ఇంట‌రాక్టివ్ వాట్సాప్ స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. ఎల్ఐసీ ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో త‌మ పాల‌సీల‌ను న‌మోదుచేసుకున్న పాల‌సీదారులు ఈ వాట్సాప్ స‌ర్వీసును ఉప‌యోగించుకోవ‌చ్చు. వాట్సాప్ స‌ర్వీస్ ద్వారా పాల‌సీదారులు త‌మ పాల‌సీల వివ‌రాల‌ను, యులిప్ ప్లాన్ స్టేట్‌మెంట్ స‌హా ప‌లు స‌మాచారాన్ని, సేవ‌ల‌ను ఎల్ఐసీ అఫిషియ‌ల్ వాట్సాప్ చాట్‌చాక్స్ ద్వారా పొందే వెసులుబాటు ఉంది.*


*🌀ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా సేవ‌లు పొందగోరు పాల‌సీదారులు ఆన్‌లైన్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ పాల‌సీల‌ను నమోదు చేయ‌కుంటే త‌క్ష‌ణ‌మే రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని ఎల్ఐసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరింది. ఇక ఎల్ఐసీ వాట్సాప్ సేవ‌లు పొందేందుకు తొలుత క‌స్ట‌మ‌ర్లు త‌మ ఫోన్‌లో ఎల్ఐసీ వాట్సాప్ నెంబ‌ర్ 8976862090ను సేవ్ చేసుకోవాలి.*

*💠వాట్సాప్ ఓపెన్ చేసి ఎల్ఐసీ వాట్సాప్ చాట్ బాక్స్‌లోకి వెళ్లి ఆపై చాట్ బాక్స్‌లో హాయ్ అని టైప్ చేస్తే ఎల్ఐసీ చాట్‌బోట్ క‌స్ట‌మ‌ర్‌కు 11 ఆప్ష‌న్స్‌ను చూపి వాటిలో ఎంచుకోవాల‌ని కోరుతుంది. ఇందులో క‌స్ట‌మ‌ర్ కోరిన నెంబ‌ర్ ఆధారంగా ఆయా స‌మాచారాన్ని ఎల్ఐసీ షేర్ చేస్తుంది. ఈ ఆప్ష‌న్స్‌లో ప్రీమియం తేదీ, బోన‌స్ స‌మాచారం, పాల‌సీ స్టేట‌స్‌, లోన్ ఎలిజిబిలిటీ వివ‌రాలు, రుణానికి చెల్లించాల్సిన వ‌డ్డీ, యులిప్ యూనిట్స్‌ స్టేట్‌మెంట్, ఎల్ఐసీ స‌ర్వీస్ లింక్స్ వంటి క‌స్ట‌మ‌ర్ కోరిన స‌మాచారాన్ని కంపెనీ అంద‌చేస్తుంది.*

Instructions to Tax Payers

*🏵️పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు*
•••••••••••••••••••
ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను(టాక్స్) రూ12000 లకు మించితే  మీరు   

అడ్వాన్స్ పన్ను చెల్లింపు లోకి వెళతారు.

అడ్వాన్స్ టాక్స్ క్రింది విధాలు గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో)  ఉంటుంది

March-May  15%

Jun-Aug 45%

Sep-Nov  75%

Dec-Feb 100%

అడ్వాన్స్ టాక్స్ కట్టకపోతే పై నెలల్లో

కట్టాల్సిన టాక్స్ కి  1%-2% ఇంట్రెస్ట్ లెక్కిస్తారు. దీన్ని ఈ-ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.

ఒకవేళ అధికంగా టాక్స్ ముందస్తు కట్టిన దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి  రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.

ఉద్యోగి టాక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income టాక్స్ డెఫిర్ట్మెంట్ దృష్టిలో పన్ను చెల్లించనట్లే లెక్క.మనం టాక్స్ కట్టినా కట్టని కిందికి వస్తాము.

 కావున ప్రతి ఉద్యోగి తమతమ DDO ని అడిగి TDS చేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.

ప్రతి ఉద్యోగి జూన్ 31 లోపు తమ ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచో

ఆలశ్య రుసుము క్రింద రూ 1000/5000 లు చెల్లించాలి.

*DDO లకు సూచనలు*
DDO తన పరిధి లొ గల ఉధ్యోగులు ఎవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టాక్స్ కట్ చేయాలి .(అడ్వాన్స్ స్లాబ్ వారీగా)

DDOలు క్వార్టర్ వారీగా TDS క్రమం తప్పకుండా డ్యూ DATE లోపు చేయించాలి.

లేట్ ఫైల్ చేసిన చో (ఏ క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో DDO TDS చేయించలేకపోయిన చో)

DDO కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు కి రూ200లు చెల్లింపు చేయాలి(ఎంత టాక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME టాక్స్ డిపార్ట్మెంట్ వస్తాయి.DDO రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

TDS అమౌంట్  తక్కువగా cut(టాక్స్) చేయడం వలన  ఆ కాలానికి ఇంట్రెస్ట్ క్రింద DDO కూడా చేయించవలసి ఉంటుంది.

లేట్ ఫైల్ చేయడం వలన .లేట్ ఫీ  బాటుగా ఇంట్రెస్టు ను కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు

ఒక్కోసారి రిఫండ్ కూడా పొందలేము.

TDS అనే ప్రక్రియ లో టాక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకే సారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది . ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.

ఈ-ఫైలింగ్ ని ఏ ఉద్యోగికి వారు వేరు వేరు గా ఈ-ఫైలింగ్ చేయించుకోవాలి.

పై సూచనలు ఆధారంగా DDO/EMPLOYEE సకాలంలో తమ టాక్స్ మరియు TDS.ఈ-ఫైలింగ్ చేసుకోగలరు.