Income Tax 2024-25 Software

 Income Tax 2024-25 Softwares


@    Income Tax Calculator for the financial year  2024-25 ( Putta Srinivas Reddy )

@    Income Tax Calculator for the financial year 2024-25 ( Medak Badi - Vijaykumar )

@    Income Tax Calculator for the fy 2024-25 ( Chandrashekar Reddy)




The income tax rates for FY 2024-25 (AY 2025-26) under the old tax regime.

Income tax slabs for individuals (<60 Years) under old tax regime

Income tax slabs (Rs)

Income tax rates (%)

From 0 to 2,50,000

0

From 2,50,001 to 5,00,000

5

From 5,00,001 to 10,00,000

20

From 10,00,001 and above

30

 

 

Income tax slabs for senior citizens (60 to 79 Years) under old tax regime

Income tax slabs (Rs)

Income tax rates (%)

From 0 to 3,00,000

0

From 3,0,001 to 5,00,000

5

From 5,00,001 to 10,00,000

20

From 10,00,001 and above

30

 

 

Income tax slabs for super senior citizens(>=80 Years) under old tax regime

Income tax slabs (Rs)

Income tax rates (%)

From 0 to 5,00,000

0

From 5,00,001 to 10,00,000

20

From 10,00,001 and above

30

 

 

Income tax slabs under new tax regime for FY 2024-25

Income tax slabs (Rs)

Income tax rate (%)

From 0 to 3,00,000

0

From 3,00,001 to 7,00,000

5

From 7,00,001 to 10,00,000

10

From 10,00,001 to 12,00,000

15

From 12,00,001 to 15,00,000

20

From 15,00,001 and above

30

Note: U/S 87A ,Tax rebate up to Rs.25,000 is applicable if the total income does not exceed Rs 7,00,000

Changes made in the FY 2024-25

a)  Standard deduction limit increased to Rs 75,000 from Rs 50,000 . This standard deduction is available to those individual taxpayers who are receiving income from salary or pension

b) Hike in standard deduction limit for family pensioners to Rs 25,000 from Rs 15,000 -  This standard deduction is applicable to have receiving family pensions.

c)  The employer's contribution to the NPS account Hiked to 14% from 10%. This hike in deduction will help the employees to save more tax in the new tax regime

Changes in Taxation on Capital Gains

Budget 2024 has made significant changes on the tax implications on the capital gains which are as under:

Holding period for determining long-term and short-term has been simplified for all listed securities - a period of 12 months is to be considered, and for other assets period of 24 months should be considered for determining whether the asset is a long-term capital asset or not.

Further, no indexation will be available for sale made from 23rd July, 2024 for any long term capital asset.

LTCG Tax Rate u/s 112A and 112 have been changed to 12.5% from 23rd July, 2024. 

STCG Tax Rate u/s 111A has been increased to 20% from 23rd July, 2024.

Further, exemption limit u/s 112A has been increased from Rs. 1 lakh to Rs. 1.25 lakhs.

Pension Received by a Family Member

Pension received by a family member is taxed under the head ‘income from other sources’ in family member’s income tax return. 

If this pension is commuted or is a lump sum payment, it is not taxable in certain cases

Uncommuted pension received by a family member is exempt to a certain extent. Rs. 25,000 or 1/3rd of the uncommuted pension received – whichever is less is exempt from tax. (This amount of Rs. 25,000 has been increased from Rs.15,000 with effect from FY 2024-25)

For example – If a family member receives a pension of Rs 1,00,000, the exemption available is least of – Rs 25,000 or Rs 33,333 (1/3rd of Rs 1,00,000). 

Thus, the taxable family pension will be Rs.75,000 (Rs 1,00,000 – Rs 25,000)

80E Education loan: 

The interest you pay on an education loan is entirely tax-free, as you can claim tax deductions against it

Time Limit for Claiming Deductions: you can claim deductions under Section 80E for up to eight years. The tenure starts from the year you start paying back the loan's interest or until all the interest has been paid off, whichever is earlier

HOME LOAN TOP-UP OFFER TAX BENEFITS :

You can avail a maximum deduction of Rs.30,000 on a Home Loan Top-up if you have receipts and documents proving that the Top-up Home Loan has been used for acquisition/ construction/repair/renovation of a residential property. The limit of Rs 30,000 is available for a self-occupied house only. In case repairs and renovations have been done on a let-out property, no deduction can be claimed

Switching Back to the Old Tax Regime

From the financial year 2023-24, the new income tax regime will be valid as the default tax regime.

The frequency of switching between old and new tax regimes depends on the type of your income. If it's professional or business income, you can switch between old and new tax regimes only once during the lifetime. But if the income type is other than professional/business income, you can switch between the old and new tax regimes yearly. 

JEE MAIN 2025 Examination Instructions in Telugu



*🔊JEE Main 2025 :

    🍥 జేఈఈ మెయిన్‌(JEE (Main) 2025) తొలి విడత పరీక్షకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాసే ఈ పరీక్షలు బుధవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్‌టీఏ(NTA) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జరిగే JEE Main 2025 పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డు (Admit card)ను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక సూచనలు ఇవిగో..

💥ఇవి మరిచిపోవద్దు..

 ➡️పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా తమ అడ్మిట్‌ కార్డును వెంట తీసుకెళ్లాలి. దీంతో పాటు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారంను కచ్చితంగా నింపాలి. అడ్మిట్‌ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
    
➡️ఫొటో ఐడీ: పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను నిర్ధారించేలా ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసుపుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రం వద్దకు తీసుకెళ్లాలి.
    
➡️పరీక్ష కేంద్రానికి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను తీసుకెళ్లడం మరిచిపోవద్దు. మీరు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్‌ చేసిన ఫొటోనే ఎగ్జామ్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఎందుకంటే దాన్ని అటెండెన్స్‌ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది.
    
➡️విద్యార్థులు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్‌పాయింట్‌ పెన్‌ను తీసుకెళ్లాలి.*
    
➡️పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌: దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్‌ ఆఫీసర్‌ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి.

 ➡️మీ అడ్మిట్‌ కార్డులో ఇచ్చిన సూచనల్ని క్షుణ్ణంగా చదవండి.
    
➡️పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగానే చేరుకొనేలా ప్లాన్‌ చేసుకోండి. అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయండి. పరీక్ష హాలు తెరవగానే మీకు కేటాయించిన సీట్లో కూర్చొని పరీక్ష రాసేందుకు అవసరమైనవన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోండి.
    
➡️ట్రాఫిక్‌ జామ్‌, రైలు/బస్సు ఆలస్యం వంటి కారణాల వల్ల పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోకపోతే.. అక్కడ ఇన్విజిలేటర్లు ఇచ్చే ముఖ్యమైన సూచనల్ని మీరు మిస్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ఆలస్యానికి ఎన్‌టీఏ ఎలాంటి బాధ్యత వహించదు.
    
➡️పరీక్ష హాలులో ఏదైనా సాంకేతిక సాయం/ఎమర్జెన్సీ, పరీక్షకు సంబంధించి ఇబ్బంది ఎదురైతే సెంటర్‌ సూపరింటెండెంట్‌ /ఇన్విజిలేటర్‌ను సంప్రదించవచ్చు.
    
➡️కంప్యూటర్‌లో మీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు ప్రకారం ప్రశ్నపత్రం వచ్చిందో లేదో సరిగా నిర్ధారించుకోండి. వేరే సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నపత్రం వస్తే వెంటనే సంబంధిత ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లండి.
    
➡️పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్‌ షీట్లపైనే కాలిక్యులేషన్సు/రైటింగ్‌ వర్కు చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత రఫ్‌ షీట్లను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
    
➡️కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు/సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు జేఈఈ(మెయిన్‌) వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.* 
    
➡️పరీక్షలకు ముందు రోజు కొత్త టాపిక్స్‌ను కవర్‌ చేసేందుకు ప్రయత్నించొద్దు. దానివల్ల విద్యార్థుల ఒత్తిడి, ఆందోళన స్థాయి పెరుగుతుంది.
    
➡️పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సిన వాటిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి. పరీక్ష కేంద్రం ఎక్కడో ముందుగానే ఓసారి చూసుకొని రండి. లొకేషన్‌, అక్కడి పరిసరాల గురించి తెలుసుకోవడం మంచిది.
    
➡️ఒక అభ్యర్థి తప్పుడు సమాచారంతో ఒకటి కంటే ఎక్కువ షిఫ్ట్‌లు/తేదీల్లో పరీక్ష కేంద్రం వద్ద కనిపిస్తే.. అతడి/ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు. వారి ఫలితాలను ప్రకటించరు.
    
➡️ఏ కారణం చేతనైనా షెడ్యూల్ చేసిన పరీక్ష తేదీకి హాజరు కాలేని వారికి  ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌టీఏ తిరిగి పరీక్ష నిర్వహించదు.

💥పరీక్ష కేంద్రం వద్ద వీటికి నో ఎంట్రీ..

🌀చిరుతిళ్ళు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్స్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్‌ మెటీరియల్‌, వాటర్‌ బాటిళ్లు, మొబైల్‌ఫోన్‌/ఇయర్‌ ఫోన్‌/మైక్రోఫోన్‌/పేజర్‌, కాలిక్యులేటర్‌‌, డాక్యుపెన్‌, కెమెరా, టేప్‌ రికార్డర్‌ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఎక్కువ పాకెట్స్‌ ఉన్న దుస్తులు వేసుకోరాదు. వీటితో పాటు నగలు, మెటాలిక్‌ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం.

For More Info Click below  :


****





FLN & LIP Data Entry Online Process



FLN & LIP MIDLINE DATA ENTRY

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్  నందు  ఉపాధ్యాయులచే   FLN/LIP midline అసెస్మెంట్  డేటా  చేయుటకు అవకాశం ఇవ్వబడ్డది.

నమోదు చేయు విధానము:

@ Click below link  and Download the App



@    STEPS TO FOLLOW

 1. Open/click on  Telangana School Education app  in your phone.

2. User type -select- *Teacher*

3. Enter *treasury ID*

4. Enter *OTP* sent to registered Mobile number.

5. Click on *LIP* (6-9th classes )or *FLN* (1-5th class).

6. Click on *Student performance/ Learning Tracker.*

7. Year-Select- *2024-25*

8. Assessment type-select- *Midline* 

9. *Tap on 3 dots on the top right corner of the phone*

10. Click on *assessment* 

11. Select *class, medium, section , subject, year, assessment type*.

12. Select the *relevant check box* against the child name and *save* the data.

13. Click on *submit* tab, 

****



Medical Reimbursement - Health Insurance

*Medical Reimbursement - Health Insurance*

    *ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మెడికల్ expenditure ను ఆ సంస్థ నుండి పొంది తిరిగి అదే వైద్య ఖర్చును తిరిగి ప్రభుత్వ మెడికల్ రీయంబర్స్మెంట్ పొందవచ్చునా అనేదానిపై క్లారిఫికేషన్ ఇచ్చినారు.*

     *GO.77.dated14.07.2022 ద్వారా ప్రభుత్వ కార్యదర్శి గారు క్లారిఫికేషన్ ఇచ్చినారు . ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ సంస్థ నుండి డబ్బులు పొందవచ్చును.

     *తిరిగి ప్రభుత్వ మెడికల్ రీయంబర్స్మెంట్ నుండి కూడా పొందవచ్చును కానీ వైద్య ఖర్చుల కైన మొత్తం బిల్ కంటే ఎక్కువగా క్లెయిమ్ చేయకూడదు.

Download :


Click below for more info about Medical Reimbursement :

Suffix - Prefix Info

*🙏HOLIDAYS INFORMATION✍️*

*🔰 సంక్రాంతి సెలవుల పై ప్రిఫిక్స్ - సఫిక్స్ వివరణ*

*♦️సెలవులు 9 రోజుల లోపు ఉంటే Closing day కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. (RC NO:815, Dated 01.09.1999) కానీ CLs మరియు సెలవులు కలుపుకుని మొత్తం 9 రోజులు మించితే మొత్తం రోజులు other than CL (OCL) పెట్టుకోవాల్సి ఉంటుంది. అనగా ELs తో గాని HPLతో గాని ఆ సెలవులను భర్తీ చేయాల్సి ఉంటుంది.*

*💠 ఈసారి సంక్రాంతి సెలవులు 13.01.2025 నుండి 17.01.2025 వరకు 5 రోజులు కలవు. కానీ 11.01.2025 రెండవ శనివారము 12.01.2025 రోజు ఆదివారము కలుపుకొని మొత్తం ఏడు రోజులు కలవు. కావున 10.01.2025 తేదీన లేదా 18.01.2025 తేదీన CL పెట్టుకోవడానికి అవకాశం కలదు.*

*✳️ సెలవులు (Term Holidays) 10 రోజుల కంటే ఎక్కువ,15 రోజుల కంటే తక్కువ* *(10,11,12,13,14,15) ఉన్న సందర్భంలో Closing day గాని Opening day గాని CL పెట్టుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి closing day and opening day రెండు రోజులు పాఠశాలకు హాజరు కావాలి. (RC NO:10324, DATED; 7.11.1969)*

*📍ఒకవేళ సెలవులు 16 రోజులు అంతకు మించి ఉన్నట్లయితే వాటిని వెకేషన్ అంటారు.అప్పుడు Opening day గాని Closing day గాని OCL(Other than CL) పెట్టుకోవడానికి అవకాశం ఉంది.*

Retirement Info



*📡రిటైర్ కాబోతున్న ఉపాధ్యాయ- ఉద్యోగులందరికీ అవగాహన నిమిత్తం కొంత ప్రాథమిక సమాచారం*

*➡️నెలలో 2వ తేదీ మరియు ఆతరువాత పుట్టిన వారు 61సం॥లు పూర్తవగానే ఆ నెల చివరి తేదీనే పదవీవిరమణ తేదీగా భావించాలి.కానీ 1వ తేదీ పుట్టిన వారికి మాత్రం ముందు నెల 30/31వ తేదీలకు 61 సం॥లు పూర్తవుతాయి కాబట్టి ముందు నెల చివరి రోజును రిటైర్ మెంట్ రోజుగా పరిగణించాలి. చనిపోయిన వారి విషయంలో చనిపోయిన రోజును కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

*➡️రిటైర్మెంట్ కు 6 నెలల ముందుగానే SRను అప్డేట్ చేసి పెన్షన్ ప్రపోజల్స్  AG ఆఫీసుకు పంపవచ్చు. ఈ 6 నెలల్లో ఇంక్రిమెంట్ ఉన్ననూ అడ్వాన్స్ గా నమోదు చేసి పంపవచ్చు.

*➡️ఒక నెలలో రిటైర్ అయ్యేవారి ఇంక్రిమెంట్ కనుక వెంటనే మరుసటి నెలలో ఉన్నట్లయితే, GO No:235 27-10-1998 ప్రకారం ఒక ఇంక్రిమెంటును మంజూరు చేయాలి.(ఇది కేవలం పెన్షన్, గ్రాట్యుటీ,కమ్యుటేషన్ లకు మాత్రమే వర్తిస్తుంది)

*➡️పెన్షన్ ప్రతిపాదనలు ప్రాథమిక & ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లవి MEOలు, ఉన్నతపాఠశాలల ఉపాధ్యాయులవి HM లు నేరుగా AG ఆఫీసు  పంపవచ్చు. DEO ఆఫీసుకు అవసరం లేదు. HM & MEOలవి మాత్రం DyEO, DEO ద్వారా AGఆఫీసుకు పంపాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం DEO ద్వారానే పంపాలి.

*➡️సర్వీసు 33సం॥లకు తగ్గినచో 5 సం॥ల వెయిటేజీ కలుపబడును. (VRS ఇచ్చేవారికి కూడా)

*➡️పెన్షన్ కు చివరి బేసిక్ పే ను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు.

*➡️ఉద్యోగి చనిపోయినపుడు అర్హతగల కుటుంబసభ్యులకు ఫ్యామిలీ పెన్షన్  వస్తుంది. గ్రాట్యుటీ కుటుంబసభ్యులకు పంచుతారు. వీరికి కమ్యుటేషన్ వర్తించదు.

*➡️AG ఆఫీసువారు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ను శాంక్షన్ చేసి, DTOద్వారా STOలకు పంపుతారు.

*➡️పెన్షన్ ఫైల్ STO లకు చేరిన తరువాత AG ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన PPO ఒరిజినల్ కాపీ,  Bank Pass Book Xerox Copy, Aadhar & PAN Xerox, 3 Photoesలతో STO ఆఫీసుకు వెళ్లి STOను కలవాలి

*➡️రిటైర్ అయిన వారి సర్వీస్ హెల్త్ కార్డు Cancle అవుతుంది కాబట్టి,పెన్షనర్ గా కొత్త హెల్త్ కార్డు పొందవలసిఉంటుంది.  పెన్షన్ పేస్లిప్, PPOకాపీ, ఫోటో,రిక్వెస్ట్ లెటర్ తదితరాలతో కొత్త హెల్త్ కార్డును తీసుకోవాలి.

CLICK BELOW FOR PENSION INFO..

@    Pension

Apaar ID Details in Telugu




Apaar IDని సృష్టించే ప్రక్రియ చాలా సులభం మరియు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. మీరు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు:

@ డిజిలాకర్‌లో నమోదు చేసుకోండి:

        ముందుగా DigiLocker అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

-    మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా OTP ద్వారా ధృవీకరించండి.

-    మీ పేరు, ఆధార్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.
-    ఆధార్ కార్డ్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
మీ సమాచారం మరియు పత్రాలను ధృవీకరించిన తర్వాత, Apaar ID జనరేట్ చేయబడుతుంది.

@ డిజిలాకర్ అంటే ఏమిటి? : అపార్ కార్డ్ అంటే ఏమిటి?

    DigiLocker అనేది భారత ప్రభుత్వం అందించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్, ఇక్కడ మీరు మీ అన్ని ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇది క్లౌడ్-ఆధారిత సేవ, ఇది విద్యార్థుల విద్యా పత్రాలను సురక్షితం చేస్తుంది.

    DigiLocker సహాయంతో మీరు Apaar IDని సులభంగా యాక్సెస్ చేయవచ్చు మరియు మీ డిజిటల్ సర్టిఫికేట్‌లను ఎక్కడైనా మరియు ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

@ Apaar IDని డౌన్‌లోడ్ చేయడం ఎలా? 

    Apaar IDని డౌన్‌లోడ్ చేయడానికి, మీరు ఈ క్రింది విధానాన్ని అనుసరించండి:

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:

-    Apaar ID: https://apaar.education.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

-    మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, OTP ద్వారా లాగిన్ చేయండి.

-    లాగిన్ అయిన తర్వాత, మీ Apaar ID స్క్రీన్‌పై కనిపిస్తుంది.
దీన్ని PDF ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయండి.

@ Apaar ID యొక్క ప్రయోజనాలు ఏమిటి? , అపార్ కార్డ్ అంటే ఏమిటి?

Apaar ID విద్యార్థులకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో ప్రధాన ప్రయోజనాలు:

@ విద్యా పత్రాల డిజిటల్ నిల్వ:

-    Apaar ID ద్వారా, విద్యార్థుల అన్ని విద్యా పత్రాలు డిజిలాకర్‌లో సురక్షితంగా ఉంటాయి.
విద్యా ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్ ఇప్పుడు సులభంగా మరియు త్వరితగతిన మారింది.

@ అకడమిక్ రికార్డుల నిర్వహణ:

-    ఇది ఒకే చోట విద్యార్థుల మొత్తం విద్యా ప్రయాణం యొక్క రికార్డును అందిస్తుంది.

-    Apaar IDతో, విద్యార్థులు భౌతిక పత్రాలను ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రికార్డులు డిజిటల్ ఫార్మాట్‌లో సురక్షితంగా ఉంటాయి.

-    Apaar ID భారతదేశం అంతటా చెల్లుతుంది మరియు అన్ని విద్యా సంస్థలచే ఆమోదించబడుతుంది.

Download :



@     Helpline Number: 18008893511



SBI Salary Account Benefits




 *SBI శాలరీ ప్యాకేజ్ అకౌంట్ రకాలు: 

- ఉద్యోగి జీతం రూ.2 లక్షల దాటితే రోడియం కేటగిరీలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
- జీతం రూ.1 లక్ష- రూ.2 లక్షల వరకు ఉంటే ప్లాటినం అకౌంట్ ప్రారంభించొచ్చు.
- జీతం రూ.50,000-రూ.లక్ష వరకు ఉంటే డైమండ్ కేటగిరీ కిందకు వస్తారు.
- జీతం రూ.25,000-రూ.50,000 వరకు ఉంటే గోల్డ్ విభాగంలో ఖాతా ప్రారంభించొచ్చు.
- జీతం రూ.10,000-రూ.25,000 వరకు ఉంటే సిల్వర్ కేటగిరీలో అకౌంట్ తీసుకోవచ్చు. 
- ఈ కేటగిరీలను బట్టి, బ్యాంక్ అందించే ప్రయోజనాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. ప్రతి ప్రయోజనాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందుకోవచ్చు.

 *SBI శాలరీ అకౌంట్ ప్రయోజనాలు: 

- ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఖాతాలో ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టీ ఉండదు.
- మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు.
- మీ అకౌంట్ కోసం ఫ్యాన్సీ నంబర్ తీసుకోవచ్చు.
- ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది ఐచ్ఛికం. మీ అకౌంట్లో మీ అవసరానికి మించి డబ్బు ఉంటే, ఈ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు, మిగిలిన డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళుతుంది. మీకు అవసరమైనప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆ - డబ్బును వెనక్కుతీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నన్ని రోజులకు మీకు వడ్డీ లభిస్తుంది.
- సాధారణ కస్టమర్ల కంటే ప్రత్యేకమైన ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డ్ వస్తుంది.
- భారతదేశంలోని SBI లేదా ఇతర బ్యాంకుల ATMల్లో ఎన్నిసార్లయినా డబ్బు తీసుకోవచ్చు, ఛార్జీలు వర్తించవు.
- శాలరీ కేటగిరీని బట్టి బ్యాంక్ నుంచి ఇంటర్నేషనల్ రోడియం/ప్లాటినం/డైమండ్/గోల్డ్/సిల్వర్ డెబిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఏటీఎంలోకి వెళ్లినప్పుడు మీ ఖాతాలోని రూపాయలు ఆటోమేటిక్గా ఆ దేశపు కరెన్సీలోకి మారి, ఆ కరెన్సీ ఏటీఎం నుంచి వస్తుంది.
- క్రెడిట్ కార్డ్ మీద కూడా ప్రత్యేక బెనిఫిట్స్ అందుతాయి.
- డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ఛార్జీల నుంచి 100% మినహాయింపు ఉంటుంది. ఒక నెలలో ఎన్ని డీడీలయినా తీసుకోవచ్చు.
- నెలకు 25 చెక్ లీవ్స్ వరకు తీసుకోవచ్చు, దీనికి కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
- ఆన్లైన్ RTGS / NEFT ఛార్జీల నుంచి మినహాయింపు.
- మిగిలినవారి కంటే తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు (SBI Personal Loan), కారు లోన్ (SBI Car Loan), గృహ రుణాలు (SBI Home Loan) అందుబాటులో ఉంటాయి.
- ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. జీతం రావడం ఆలస్యమైన సందర్భాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీలో ఉన్న ఉద్యోగులు రూ.2 లక్షలు వరకు తీసుకోవచ్చు. డైమండ్ కేటగిరీలో ఉన్నవాళ్లు గరిష్టంగా రూ.1.50 లక్షలు, గోల్డ్ విభాగంలోని వ్యక్తులు రూ.75,000 వరకు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సిల్వర్ కేటగిరీ వాళ్లకు ఈ సౌకర్యం లేదు.
- వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ కూడా లభిస్తుంది. ప్లాటినం వాళ్లకు ఏడాదికి 25% డిస్కౌంట్, డైమండ్ వాళ్లకు 15% డిస్కౌంట్ ఉంటుంది. 
- OTT, ఫుడ్ అగ్రిగేటర్స్ (జొమాటో, స్విగ్గీ వంటివి) సబ్స్క్రిప్షన్లను కూడా కొన్నాళ్ల పాటు ఉచితంగా అందుకోవచ్చు. 
- మూవీ టిక్కెట్ల బుకింగ్ సమయంలో డిస్కౌంట్స్ లభిస్తాయి. 
- స్పా, జిమ్, గోల్ఫ్ క్లబ్ వంటి వాటిల్లోకి కాప్లిమెంటరీ విజిట్స్ లభిస్తాయి.
- శాలరీ కేటగిరీని బట్టి, మీ డెబిట్ కార్డ్ ద్వారా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ల్లోకి ఉచిత ప్రవేశం లభిస్తుంది.

 *కోటి రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్* 

శాలరీ అకౌంట్ హోల్డర్కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ప్రీమియం డబ్బును బ్యాంక్ కడుతుంది. ఏదైనా ప్రమాదంలో ఖాతాదారు మరణిస్తే బ్యాంక్ నుంచి 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో లభిస్తాయి. అదనంగా, డెబిట్ కార్డ్ మీద కూడా బీమా ఉంటుంది. డెబిట్ కార్డ్ నుంచి కవరేజ్ రూపంలో మరో రూ.10 లక్షల వరకు వస్తాయి. మొత్తంగా కలిపి రూ.40 లక్షల వరకు ఆ కుటుంబానికి అందుతాయి. క్లెయిమ్ చేసుకున్న 15 రోజులలోపు డబ్బులు వస్తాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.30 లక్షలు బ్యాంక్ నుంచి అందుతాయి. చాలామందికి ఈ విషయం తెలీక క్లెయిమ్ చేయడం లేదు.

శాలరీ అకౌంట్ హోల్డర్కు కోటి రూపాయల వరకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్లకు ఈ కవరేజ్ ఉంటుంది. దీనికి అదనంగా, ATM కార్డ్ మీద కూడా ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కార్డ్ రకాన్ని బట్టి వచ్చే కవరేజ్ మొత్తం మారుతుంది.

 *SBI అందించే వివిధ రకాల శాలరీ ఖాతా ప్యాకేజ్లు ఏమిటి?

సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ ప్యాకేజ్ (CGSP)
స్టేట్ గవర్నమెంట్ శాలరీస్ ప్యాకేజ్ (SGSP)
రైల్వే శాలరీ ప్యాకేజ్ (RSP)
డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ (DSP)
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ (CAPSP)
పోలీస్ శాలరీస్ ప్యాకేజ్ (PSP)
ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజ్ (ICGSP)
కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ (CSP)
ప్రారంభ శాలరీ ప్యాకేజ్ ఖాతా (SUSP)

జీతం పొందే వ్యక్తి నేరుగా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లిగానీ, YONO యాప్ ద్వారా గానీ జీతపు ఖాతా తెరవొచ్చు.

 *శాలరీ అకౌంట్ తెరవడానికి అవసరమైన పత్రాలు:

పాస్పోర్ట్ సైజ్ ఫోటో
పాన్ కార్డ్ కాపీ
వ్యక్తిగత గుర్తింపు & చిరునామా రుజువు పత్రాలు
ఉద్యోగి ఐడీ కార్డ్ జిరాక్స్
సర్వీస్ సర్టిఫికెట్
తాజా పే స్లిప్

 *ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను శాలరీ అకౌంట్గా మార్చొచ్చా?

మార్చొచ్చు. SBIలో ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను జీతం ప్యాకేజ్ ఖాతాగా మార్చొచ్చు. ఇందుకోసం పైన చెప్పిన పత్రాలను బ్యాంక్కు సమర్పిస్తే చాలు.