Enrollment of Vote to MLC

*🚩రాబోయే ఉపాధ్యాయ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేయించుకోగలరు..ప్రతి ఒక్కరూ మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకోవలసి ఉంటుంది. కొత్తగా VOTE ENROLLMENT చేసుకున్న వారు మాత్రమే ఓటు వేయడానికి అర్హత పొందుతారు.. ఎవరికి వారు మొబైల్, ట్యాబ్ లేదా కంప్యూటర్లో ఈజీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.. కొన్ని సూచనలు*

*💥టీచర్ ఎమ్మెల్సీకి అర్హత ఉన్నవారు TEACHER,  గ్రాడ్యుయేట్ గా వేరువేరుగా ఓటు నమోదు చేసుకోవాలి.టీచర్ ఎమ్మెల్సీ ఓటు కోసం 2018 నుండి 2024 మధ్య 6 సంవత్సరాల కాలంలో ఏదైనా 3 సంవత్సరాలు వరుసగా లేదా BREAKS తో టీచరుగా ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉండాలి.గ్రాడ్యుయేట్ ఓటరు నవంబర్ 2021 నాటికి..NOVEMBER 1 2024..3 YEARS BEFORE గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి*


TEACHER MLC VOTE..FORM 19...

*🚩ఓటును ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో లింక్ ద్వారా ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. లేనిపక్షంలో ఆఫ్లైన్లో అప్లికేషన్ సంబంధిత డిగ్రీ గెజిటెడ్ అటే స్టేషన్ చేసి మరియు టీచర్ సర్వీస్ సర్టిఫికెట్ జత చేసి ఎమ్మార్వో కార్యాలయంలో సబ్మిట్ చేయాలి*

*🚩GRADUATE కాన్స్టెన్సీలో మెదక్, కరీంనగర్, నిజాంబాద్ ఆదిలాబాద్ ఒకటి మాత్రమే వస్తుంది.TEACHER ఎమ్మెల్సీ లో  వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టెన్సీ కూడా కనిపిస్తుంది. దాంట్లో మీ నియోజకవర్గం సెలక్ట్ చేసుకోవాలి. మీరు పని చేస్తున్న జిల్లా లేదా మీరు ఓటు వేయాలనుకుంటున్న జిల్లా కేంద్రం ఎంటర్ చేయాలి.*

*💥ఆన్లైన్ ద్వారా ENROLLMENT చేసేవారు RED స్టార్ మార్క్ ఉన్న వాటిని కచ్చితంగా నింపవలసి ఉంటుంది.. ఇంగ్లీషులో FILL చేస్తూ దాన్ని తెలుగులో కూడా ఫిల్ చేయవచ్చు.NAME OF RELATIVE APPLICANT వద్ద FATHER/MOTHER/WIFE/HUSBAND FILL చేయాలి*

*🚩అడ్రస్ కచ్చితంగా తప్పనిసరిగా భర్తీ చేయాలి. దానిలో మీ మండలం తాసిల్దార్ కార్యాలయం భర్తీ చేయాలి. పూర్తిచేసిన అప్లికేషన్లన్నీ అదే మండల ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తాయి.ఎలక్షన్ జరిగే నియోజకవర్గంలో మీరు టీచర్ గా పని చేస్తూ ఉండి,గ్రాడ్యుయేట్ ఓటరుగా ఉండి మీరు ఎన్నికలు లేని ప్రాంతంలో నివాసం ఉన్నట్లయితే మీ పాఠశాల అడ్రస్ లేదా మీరు ఓటు వేయాలనుకునే మండల కేంద్రం లో మీ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల అడ్రస్ ఇవ్వవచ్చు. మీరు అడ్రస్ ఇచ్చిన మండలంలో మీకు పోలింగ్ కేంద్రం ఉంటుంది. అక్కడ సంబంధిత BLO కు పరిశీలనకు మీ అప్లికేషన్ పంపబడుతుంది.*

*🚩ఓటర్ ఐడి వివరాలు మరియు ఆధార్ వివరాలు తప్పనిసరి కాదు. స్కూల్ అడ్రస్ లేదా ఇతర అడ్రస్ ఇచ్చినప్పటికీ కూడా ఆధార్ నెంబరు భర్తీ చేసిన ఇబ్బంది లేదు.గ్రాడ్యుయేట్ లేదా డిప్లమా ఇంజనీరింగ్ లేదా ఇతర డిగ్రీలు ఉంటే వాటిని ఎంటర్ చేయాలి. యూనివర్సిటీ పేరు PROVISIONAL సర్టిఫికెట్ మీద ఉన్న DATE నమోదు చేయాలి.డిగ్రీ ప్రొవిషనల్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఫోటో అప్లోడ్ చేయవచ్చు.*

*🚩మీయొక్క ఫోటో 100 KB లోపు ఉండాలి, మీ సర్టిఫికేట్ 200 కేబిలోపు ఉండాలి...ఫోటో సైజ్ తగ్గించే అప్లికేషన్ ఉపయోగించి తగ్గించవచ్చు లేదా CROP చేయవచ్చు. వాట్సాప్ లో ఇతరులకు ఫోటో షేర్ చేసి మళ్లీ మనకు షేర్ చేసుకున్న సైజు తగ్గుతుంది. గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఫైల్ CHOOSE చేసుకుంటే సరిపోతుంది. టీచర్ ఎమ్మెల్సీ ఓటరు ఫోటో, సర్వీస్ సర్టిఫికెట్ ఫైల్ CHOOSE,అప్లోడ్ చేయవలసి ఉంటుంది*

*💥నా యొక్క పేరు ఏ ఇతర గ్రాడ్యుయేట్ లేదా టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టెన్సీలో ఓటరుగా ఇప్పటికే నమోదు అయి లేదు అని బాక్స్ టిక్ చేసి, మీ మొబైల్ నెంబరు,మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ACKNOWLEDGEMENT నెంబర్ వస్తుంది దాని స్క్రీన్ షాట్ చేసి నమోదు చేసి పెట్టుకోవాలి.VOTE పొందడంలో ఇబ్బంది అయితే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఎమ్మెల్సీ ఓట్ స్టేటస్ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది*

*🚩మీ యొక్క ఓటు ఎంతో అమూల్యమైనది,ఎంతో ప్రభావితమైనది అందరూ ఓటరుగా తప్పకుండా నమోదు చేసుకోండి.